విజయనగరం జిల్లాలో టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గాల్లో గజపతినగరం ఒకటి. ఇక్కడ టీడీపీ 5 సార్లు విజయం సాధించింది. మూడు సార్లు కాంగ్రెస్ గెలవగా, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక బొత్స వెనుక నడుస్తూ కాంగ్రెస్ లో కీలక నాయకుడుగా ఎదిగిన అప్పలనరసయ్య 2009 ఎన్నికల్లో గజపతి నగరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు. రాష్ట్రమంతా కాంగ్రెస్కు డిపాజిట్లు దక్కకపోయినా సరే, అప్పలనరసయ్య 44 వేల ఓట్లు తెచ్చుకుని సత్తా చాటారు.