శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్‌కు గురించి చెప్పాల్సిన పనిలేదు. జిల్లా రాజకీయాలపై వీరికి మంచి పట్టుంది. ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావులు ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు జిల్లా వైసీపీకి వీరే పెద్ద దిక్కు. ఇందులో ప్రస్తుతం ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రసాదరావు, ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.