శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం....టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇచ్చాపురంలో మరో పార్టీ గెలిచింది ఒక్కసారి మాత్రమే. 1983, 1985, 1989, 1994, 1999, 2009, 2014, 2019 ఎన్నికల్లో అంటే 8 సార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్ధులదే విజయం. అయితే ఇక్కడ టీడీపీ విజయానికి చెక్ పడింది దివంగత వైఎస్సార్ సమయంలోనే. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.