2019 ఎన్నికల్లో చాలామంది వైసీపీ నేతలు జగన్ ఇమేజ్ వల్లే గెలిచిన విషయం తెలిసిందే. అలా జగన్ ఇమేజ్‌తో గెలిచిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో రెడ్డి శాంతికి శ్రీకాకుళం పార్లమెంట్ సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో శాంతికి పాతపట్నం అసెంబ్లీ సీటు ఇచ్చారు. ఇక జగన్ గాలిలో శాంతి 15వేల పైనే మెజారిటీతో టీడీపీ అభ్యర్ది కలమట వెంకట రమణమూర్తిపై విజయం సాధించారు. పైగా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో శాంతి, నియోజకవర్గంలో మంచిగా పనిచేసుకుంటున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.