ఎట్టకేలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈఎస్ఐ స్కామ్లో ఇటీవలే జైలు నుంచి వచ్చిన అచ్చెన్నకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా టీడీపీ అధిష్టానం నుంచి ప్రకటన వచ్చేసింది. అచ్చెన్నకు ఏపీ పగ్గాలు అప్పగించేశారు. ఇక టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న టెక్కలి ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నారనే విషయం ఒక్కసారి చూస్తే...2019లో జగన్ గాలి ఉన్నా సరే అచ్చెన్న టెక్కలి నుంచి విజయం సాధించారు.