అనంతపురం జిల్లా...టీడీపీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. ఇక జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం పరిటాల ఫ్యామిలీ కంచుకోట. ఈ నియోజకవర్గంలో ఆ ఫ్యామిలీకి తిరుగులేదు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం పరిటాల ఫ్యామిలీకి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చెక్ పెట్టేశారు. ఆ ఎన్నికల్లో సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని శ్రీరామ్‌కు టిక్కెట్ దక్కేలా చేశారు. తొలిసారి పోటీ చేసి శ్రీరామ్ దాదాపు 25 వేలపైనే మెజారిటీతో తోపుదుర్తి చేతిలో ఓడిపోయారు.