నెల్లూరు జిల్లా అధికార వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. అలాగే ఉన్న ఎంపీ సీటు కూడా వైసీపీకే దక్కింది. అయితే ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు కేవలం జగన్ ఇమేజ్ వల్లే గెలిచారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలా జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈ ఏడాదిన్నర సమయంలో సొంత ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.