అనంతపురం జిల్లా...టీడీపీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ వేవ్‌లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 14 సీట్లలో 2 మాత్రమే గెలుచుకుంది. ఇంకా టీడీపీ కంచుకోటలు అనుకునే స్థానాల్లో కూడా ఓటమి పాలైంది. ఇదే క్రమంలోనే కదిరి స్థానంలో కూడా వైసీపీ హవా నడిచింది.