అధికార వైసీపీకి ధీటుగా టీడీపీని సిద్ధం చేయాలని చెప్పి చంద్రబాబు, ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులని నియమించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఉన్న హిందూపురం స్థానానికి పెనుగొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని అధ్యక్షుడుగా పెట్టగా, అనంతపురం పార్లమెంట్‌కు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులని నియమించారు.