ఏపీలో నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కించుకోవాలని చాలామంది ఆశావాహులు క్యూలో ఉన్న విషయం తెలిసిందే. జగన్ ప్రస్తుతం మంత్రివర్గంలో పనితీరు బాగోని వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. రెండున్నర ఏళ్లలో మరొకసారి మంత్రివర్గ విస్తరణ చేసి, వేరే వారికి ఛాన్స్ ఇస్తానని ముందే చెప్పారు. ప్రస్తుతానికి వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటేసింది.