ఓటమి వచ్చిందని క్రుంగిపోకుండా పోరాడితే మంచి ఫలితం వస్తుందని నిరూపించిన నాయకురాలు జొన్నలగడ్డ పద్మావతి. పోస్ట్ గ్రాడ్యుషన్ చేసిన పద్మావతి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున శింగనమల నుంచి పోటీ చేసి 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఓటమి పాలైన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వచ్చారు. సాగునీటి సాధనకు నియోజకవర్గంలో పాదయాత్ర, పింఛన్దారులకు న్యాయం చేయాలని తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు చేశారు.