2019 ఎన్నికల్లో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం జగన్ ఇమేజ్‌తో గెలిచిన విషయం తెలిసిందే. కొందరు జగన్ గాలిలో భారీ మెజారిటీలు కూడా తెచ్చేసుకున్నారు. అలా భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి కూడా ఒకరు. దాదాపు 48 వేల పైనే మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి జితేంద్ర గౌడ్‌ని ఓడించారు. అయితే వెంకటరామిరెడ్డి 2014 ఎన్నికల్లో మాత్రం 5 వేల మెజారిటీ తేడాతో జితేంద్ర చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమికి 2019 ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకున్నారు.