అనంతపురం జిల్లా టీడీపీకి అనుకూలమైన జిల్లా. జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అలా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో పుట్టపర్తి కూడా ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్ధులే ఎక్కువసార్లు విజయం సాధించారు. 1983,1985, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి ఇక్కడ వైసీపీ పాగా వేసింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై వైసీపీ నేత దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 31 వేల పైనే మెజారిటీతో గెలిచారు.