అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం....జేసీ ఫ్యామిలీ అడ్డా...దశాబ్దాల పాటు తాడిపత్రిని జేసీ ఫ్యామిలీ ఏలింది. మూడు దశాబ్దాలకు పైనే కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన జేసీ దివాకర్ రెడ్డి...వరుసగా 6 సార్లు తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1989, 1994,1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జేసీ దివాకర్ రెడ్డి అదిరిపోయే విజయాలు అందుకోగా, 2014 ఎన్నికలకొచ్చేసరికి జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చి, దివాకర్ అనంతపురం ఎంపీగా గెలిస్తే, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు.