కర్నూలు జిల్లా అధికార వైసీపీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. గత రెండు పర్యాయాల నుంచి జిల్లాలో వైసీపీ సత్తా చాటుతుంది. అలాగే నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ హవా ఎక్కువగానే ఉంది. గత రెండు పర్యాయాలు ఇక్కడ వైసీపీనే గెలిచింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ చీఫ్ మార్షల్గా పనిచేసిన తొగురు ఆర్థర్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్ధి బండి జయరాజుపై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.