2019 ఎన్నికల్లో ఊహించని ఫలితాలు చాలానే వచ్చాయి. చాలామంది గెలుపు ఖాయమనుకున్న టీడీపీ నేతలు ఓటమి పాలయ్యారు. అందులో భూమా అఖిలప్రియ కూడా ఘోరంగా ఓడిపోయారు. మామూలుగా ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా ఫ్యామిలీ కంచుకోట. ఆళ్లగడ్డ నుంచి 1989లో భూమా శేఖర రెడ్డి టీడీపీ నుంచి గెలిస్తే , 1994లో భూమా నాగిరెడ్డి, 1999లో భూమా శోభా నాగిరెడ్డిలు టీడీపీ నుంచి విజయం సాధించారు. అయితే 2004లో భూమా నాగిరెడ్డి టీడీపీ పోటీ చేసి ఓడిపోగా, 2009లో శోభా నాగిరెడ్డి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2014లో శోభానాగిరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రమాదవశాత్తు మరణించగా, ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.