కర్నూలు జిల్లాలో వైసీపీ బాగా స్ట్రాంగ్‌గా నియోజకవర్గాల్లో శ్రీశైలం కూడా ఒకటి. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి సూపర్ విక్టరీ కొట్టారు. ఏపీ రాజకీయాల్లో శిల్పా బ్రదర్స్‌కు మంచి గుర్తింపు ఉంది. టీడీపీలో కీలక పాత్ర పోషించిన వీరు, 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. అయితే 2017లో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీలో టిక్కెట్ దక్కదని చెప్పి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వెళ్ళి పోటీకి దిగారు. కొన్నిరోజులకు శిల్పా చక్రపాణిరెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి వదులుకుని వైసీపీలోకి వెళ్లారు.