కడప జిల్లా అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా. వైఎస్సార్ ఉన్నప్పుడు జిల్లాలో కాంగ్రెస్ హవా ఉండేది. ఇప్పుడు జగన్ హవా నడుస్తోంది. జిల్లాలో వైసీపీ డామినేషన్ స్పష్టంగా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి చోటు లేకుండా పోయింది. 2014లో ఒక సీటు గెలిస్తే, 2019 లో సున్నాకే పరిమితమైంది. ఇక ఇక్కడ వైసీపీ నుంచి ప్రతిఒక్కరూ భారీ మెజారిటీలతోనే గెలిచారు.