కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం..వైఎస్సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే. అయితే కాంగ్రెస్-టీడీపీల నుంచి ఇద్దరు నేతలు దశాబ్దాల పాటు ప్రత్యర్ధులుగా తలపడుతూ వచ్చారు. 1983 నుంచి కాంగ్రెస్ తరుపున డిఎల్ రవీంద్రా రెడ్డి, టీడీపీ నుంచి శెట్టిపల్లి రఘురామిరెడ్డి బరిలో ఉండేవారు. 1983, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో డిఎల్ గెలిస్తే, 1985, 1999 ఎన్నికల్లో శెట్టిపల్లి గెలిచారు.