టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ హవా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే డామినేషన్. 2019 ఎన్నికల్లో వైసీపీ హవా ఎక్కువగా ఉంది. ఒక కుప్పం తప్పా మిగిలిన అన్నీ సీట్లలో వైసీపీ సత్తా చాటింది. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకోలేదు. అసలు టీడీపీకి మొదట నుంచి అనుకూలంగా లేని నియోజకవర్గాల్లో పీలేరు ఒకటి. ఇక్కడ టీడీపీ కేవలం మూడుసార్లు గెలిచింది.