వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకులకు కొదవ లేదు. తమదైన శైలిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడే వారిలో రోజా కూడా ఒకరు. టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన రోజా తొలిసారి 2004 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి, అప్పటి అధికార కాంగ్రెస్‌పై పోరాటాలు చేసి ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఎదిగారు. అదే క్రమంలో 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో టీడీపీలో రోజా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. పైగా చంద్రబాబు తనకు కావాలనే ఓడిపోయే సీటు ఇచ్చారని చెబుతూ రోజా, టీడీపీకి దూరమయ్యారు. జగన్ వైఎస్సార్సీపీ పెట్టడంతో ఆమె అందులోకి వెళ్లిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై కేవలం 858 ఓట్ల తేడాతో గెలిచి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.