చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం....టీడీపీ అధినేత చంద్రబాబు సొంతగడ్డ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు చంద్రగిరి పరిధిలోనే నారావారిపల్లె గ్రామంలోనే జన్మించారు. ఇక చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైంది కూడా చంద్రగిరిలోనే. 1978 ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగి విజయం సాధించి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 1983 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక చంద్రబాబు టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇక అక్కడ నుంచి ఏం జరిగిందో అందరికీ తెలుసు.