ఏపీలో 30 లక్షల మంది పేదలకు వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్నటివరకు ఈ ఇళ్ల పట్టాల విషయాలో టీడీపీ కోర్టులకు వెళ్ళి అడ్డుకుందని వైసీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇళ్ల పట్టాల్లో వైసీపీ నేతలు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు, విమర్శలు ఇలా కొనసాగుతుండగానే వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసింది.