అధికార వైసీపీలో చాలామంది యువ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి పలువురు యువ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అలా గెలిచిన వారిలో వెంకటేగౌడ కూడా ఒకరు. పలమనేరు నుంచి తొలిసారి పోటీ చేసిన వెంకటే..టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. దాదాపు 32 వేల ఓట్ల పైనే మెజారిటీతో వెంకటే గెలిచి సత్తా చాటారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గౌడ, నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. యువకుడు కావడంతో నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.