2019 ఎన్నికల్లో చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఒక్క కుప్పంలో తప్పా, టీడీపీ అన్నిచోట్లా ఓటమి పాలైంది. ఇక జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే వీటిల్లో వైసీపీ అతి తక్కువ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది తిరుపతి.