మరో ఏడాదిలో సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టేసి, కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్ మొదట్లోనే చెప్పారు. ఇక దీనిబట్టి చూసుకుంటే నెక్స్ట్ కేబినెట్ విస్తరణలో కొత్తవారికి అవకాశం కల్పించవచ్చు. అయితే ప్రస్తుతం విశాఖపట్నం నుంచి ఒక్కరే జగన్ కేబినెట్లో ఉన్నారు. అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. ఇక నెక్స్ట్ విస్తరణలో వైసీపీలో దూకుడుగా పనిచేస్తున్న యువ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు మంత్రిగా అవకాశం రావోచ్చని ప్రచారం జరుగుతుంది.