2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎలా వచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. జగన్ వేవ్‌లో టీడీపీలో ఉన్న బడా బడా నేతలు ఓటమి పాలయ్యారు. జగన్ ఇమేజ్‌తో 151 ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంతటి జగన్ గాలిలో కూడా టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇలా 23 మంది గెలవగలిగారు అంటే, పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ ఉండటం వల్లే అని చెప్పొచ్చు. అలా సొంత బలంతో వైసీపీ మీద గెలిచిన ఎమ్మెల్యేల్లో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కూడా ఒకరు.