విశాఖపట్నంలో బలంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో గణబాబు ఒకరు. విశాఖ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గణబాబుకు మంచి బలం ఉంది. తన తండ్రి అప్పలనరసింహం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గణబాబు, టీడీపీలోకి వచ్చి 1999 లో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 లో ఓటమి పాలయ్యారు. అయితే తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో గంటా శ్రీనివాసరావుతో కలిసి, ఆ పార్టీలోకి వెళ్లి 2009 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మళ్ల విజయ్ ప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు.