విశాఖపట్నంలో టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో నర్సీపట్నం కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ తిరుగులేని విజయాలు సాధించింది. అది కూడా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మంచి మంచి విజయాలు అందుకున్నారు. టీడీపీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2014 వరకు ఇక్కడ అయ్యన్నకు తిరుగులేదనే చెప్పాలి. 1983, 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన అయ్యన్న...1989, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.