విశాఖపట్నంలో టీడీపీకి చాలానే కంచుకోటలు ఉన్నాయి. అలాంటి కంచుకోటల్లో పాయకరావుపేట కూడా ఒకటి. 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 7 సార్లు విజయం సాధిస్తే, కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ ఒకసారి విజయం సాధించింది. అయితే కాంగ్రెస్, వైసీపీ నుంచి గెలిచిన నాయకుడు ఒక్కరే. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గొల్ల బాబూరావు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. మధ్యలో 2012 ఉపఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు.