ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష టీడీపీ నేతలు గట్టి పోటీ ఇస్తున్నారా? అంటే అన్నిచోట్ల అని చెప్పలేం కానీ, కొన్నిచోట్ల మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలకు ధీటుగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. అధికార పార్టీ మీద నిత్యం పోరాటం చేస్తూ, ప్రజల సమస్యలపై స్పందిస్తూ ముందుకెళుతున్నారు. అలా టీడీపీ నేత గవిరెడ్డి రామానాయుడు సైతం గట్టిగానే కష్టపడుతున్నారు.