ఏపీలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. వైసీపీ రాకముందు వరకు ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉండేది. కాంగ్రెస్ కనుమరుగయ్యాక వైసీపీ డామినేషన్ పూర్తిగా కనిపిస్తోంది. ఆ విషయం 2014, 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అలా ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో పాడేరు కూడా ఒకటి.