విజయనగరం జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి టీడీపీ పలు నియోజకవర్గాల్లో తిరుగులేని విజయాలు సాధిస్తోంది. అలా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో శృంగవరపుకోట కూడా ఒకటి. ఇక్కడ 1983,1985, 1989, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఒక్క 2004లో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీతో గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో వైసీపీ అభ్యర్ధి కడుబండి శ్రీనివాసరావు 11 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి కోళ్ళ లలితకుమారిపై విజయం సాధించారు.