విజయనగరం అసెంబ్లీ స్థానం...పూసపాటి అశోక్ గజపతి రాజు కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ పార్టీల ఆధిక్యం కంటే అశోక్ హవానే ఎక్కువగా ఉంటుంది. 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్.. ఆ తర్వాత 1983,1985, 1989, 1994,1999, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్క 2004లోనే ఈయన ఓటమి పాలయ్యారు. అయితే 2014లో అశోక్ విజయనగరం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక విజయనగరం అసెంబ్లీలో టీడీపీ తరుపున మీసాల గీత పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి టీడీపీ తరుపున అశోక్ కుమార్తె అతిథి పోటీ చేయగా, వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి బరిలో ఉన్నారు. ఇక జగన్ వేవ్‌లో అశోక్ కుమార్తెపై కోలగట్ల గెలిచారు.