రాజకీయాల్లో నాయకుల పార్టీల మార్పు సహజమే..అయితే సొంత అవసరం కోసం కొందరు పార్టీ మారతారు. మరికొందరు ఏమో సొంత పార్టీనే అన్యాయం చేస్తుందని చెప్పి, వేరే పార్టీలోకి వెళ్లిపోతారు. అలా అన్యాయం జరిగిందని చెప్పి విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన శంబంగి వెంకట చిన అప్పలనాయుడు టీడీపీని వీడి, వైసీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచారు.