పీడిక రాజన్న దొర...దివంగత వైఎస్సార్‌కు వీర విధేయుడు. కాంగ్రెస్‌లో ఉండగా వైఎస్‌కు అండగా నిలిచిన రాజన్న...ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్‌తో ముందుకెళుతున్నారు. కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన రాజన్న... 2004 ఎన్నికల్లో విజయనగరం జిల్లా సాలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ అనూహ్యంగా వైఎస్సార్ మరణించడం, జగన్ వైసీపీ పెట్టడంతో అందులోకి వచ్చారు.