శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం దగ్గర నుంచి పలు నియోజకవర్గాల్లో వేరే పార్టీలకు పెద్దగా గెలిచే ఛాన్స్ రాలేదు. అలా టీడీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇచ్చాపురం కూడా ఒకటి. 1983-2019 వరకు ఇక్కడ 9 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 8 సార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్ధులదే విజయం. అయితే ఇక్కడ టీడీపీ విజయానికి చెక్ పడింది దివంగత వైఎస్సార్ సమయంలోనే. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నరేశ్ కుమార్ అగర్వాల్ వైఎస్ గాలిలో గెలిచారు.