తమ్మినేని సీతారాం...ఏపీ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన స్పీకర్. సాధారణంగా స్పీకర్లు రాజకీయాల్లో వేలు పెట్టరు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయరు. కోడెల శివప్రసాద్ టైమ్ వరకు స్పీకర్లు ఇలాగే నడిచారు. కానీ ఇప్పుడు స్పీకర్గా ఉన్న తమ్మినేని శైలి వేరు. అసెంబ్లీలో స్పీకర్ పాత్ర సమర్ధవంతంగా నిర్వహిస్తూనే, తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాత్రలోకి వెళ్ళిపోయి, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడుతుంటారు.