జోగి రమేష్....ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడు. చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటికాలి మీద వెళ్లిపోతారు. మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీకు వీర విధేయుడుగా ఉన్న జోగి...కృష్ణా జిల్లాలో కీలక నాయకుడుగా ఎదిగారు. 2004లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా అవకాశం రాకపోయినా, పార్టీ కోసం కష్టపడుతూనే వచ్చారు.