కృష్ణా జిల్లా టీడీపీలో దేవినేని ఉమాకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాల కాలం నుంచి ఉమాకు ఓటమి తెలియదు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. జగన్ వేవ్‌లో ఉమా ఘోరంగా ఓడిపోయారు. అది కూడా తన చిరకాల ప్రత్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో చిత్తుగా ఓడారు. తండ్రి వసంత నాగేశ్వరరావు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన వసంత...మొదట్లో నానా కష్టాలు పడ్డారు. రాజకీయాల్లోకి రావడం రావడమే వసంత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. అయితే 1999 ఎన్నికల్లో నందిగామ నుంచి పోటీ చేసి దేవినేని ఉమాపై ఓడిపోయారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నేతగానే కొనసాగుతూ రాజకీయాలు చేశారు. ఇక రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా అయిపోవడంతో, 2014లో టీడీపీలో చేరారు.