కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం...టీడీపీకి కంచుకోట. ఇక్కడ ఎక్కువ సార్లు టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసారి గెలవగా, టీడీపీ 8 సార్లు గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ తరుపున మొండితోక జగన్ మోహన్‌రావు విజయం సాధించారు.