సాధారణంగా టీడీపీలో కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే వైసీపీలో రెడ్డి వర్గం హవా ఉంటుంది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీలో ఉన్న కమ్మ నేతలకు చెక్ పెట్టేందుకు జగన్, అదే సామాజికవర్గానికి చెందిన నేతలని పోటీలో పెట్టి విజయం సాధించారు. అలా కృష్ణా జిల్లా మైలవరంలో దేవినేని ఉమాపై వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. అయితే ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే.