కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం...మొన్నటివరకు టీడీపీకి కంచుకోట. కానీ ఎప్పుడైతే వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వచ్చేశారో అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. రాజకీయ జీవితాన్ని టీడీపీలో ప్రారంభించిన వంశీ...2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో గన్నవరం టికెట్ దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఐదేళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ, 2019 లో కూడా టీడీపీ నుంచే పోటీ చేసి గెలుపొందారు.