ఆనం రామనారాయణరెడ్డి…ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆనం. నెల్లూరు జిల్లా రాపూర్(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి 1985లో విజయం సాధించి...ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1991లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి 1994 ఎన్నికల్లో అదే రాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.