జగన్ కేబినెట్లో అవకాశం కొట్టేయాలని చూస్తున్న సీనియర్ ఎమ్మెల్యేల్లో మల్లాది విష్ణు కూడా ఒకరు. రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్తో మొదలుపెట్టిన మల్లాది, 2004లో దివంగత వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉడా చైర్మన్గా నియమితులయ్యారు. 2004నుంచి 2008 వరకు చైర్మన్గా పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.