2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు చాలామందే ఉన్నారు. అపోజిట్‌లో బలమైన టీడీపీ అభ్యర్ధులు ఉన్నా సరే కేవలం జగన్‌ని చూసి జనం వైసీపీ ఎమ్మెల్యేలని గెలిపించారు. అలా జగన్ వేవ్‌లో గెలిచిన ఎమ్మెల్యేల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కూడా ఒకరు. అయితే రమేష్ గెలుపుకు కేవలం జగన్ ఇమేజ్ ఒక్కటే కారణం కాదు. రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి కూడా ఉంది.