రాజకీయాల్లో తమ వాక్చాతుర్యంతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టే నాయకుల్లో అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రత్యర్ధి పార్టీ టీడీపీకి కౌంటర్లు ఇచ్చే అంబటి...తన రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన వైఎస్ ఫ్యామిలీ వెంటే నడిచారు. మంచి మాటకారి..సున్నితంగానే ప్రతిపక్షాలకు చురకలు అంటిస్తారు. అదిరిపోయే కామెడీ టైమింగ్తో కౌంటర్లు వేస్తారు. ఇక రాంబాబు పోలిటికల్ కెరీర్ చూసుకుంటే...ఆయన 1989లో రేపల్లె నుంచి తొలిసారి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1994, 99లో అదే కాంగ్రెస్ నుంచి ఓడిపోయారు.