2019 ఎన్నికల్లో చాలామంది వైసీపీ తరుపున భారీ మెజారిటీలతో గెలిచేశారు. అలా భారీ మెజారిటీతో గెలిచిన వారిలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఉన్నారు. దాదాపు 41 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. స్వతహాగా రియల్ ఎస్టేట్ బిల్డర్ అయిన బుర్రా, 2014 ఎన్నికలకు ముందు వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్ మీద ఉన్న అభిమానంతో జగన్ పార్టీలో చేరారు. ఆర్ధిక బలంతో పాటు, జిల్లాలో బిల్డర్‌గా మంచి పేరు ఉండటంతో, 2014 ఎన్నికల్లో కనిగిరి సీటు దక్కించుకున్నారు. అయితే టికెట్ దక్కిన విజయం మాత్రం దక్కలేదు. టీడీపీ అభ్యర్ధి కదిరి బాబూరావు చేతిలో 7 వేల మెజారిటీ తేడాతో ఓడిపోయారు.