2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో జంప్ చేసిన ఎమ్మెల్యేలకు చెక్ పడిపోయింది. కానీ ఒక్క గొట్టిపాటి రవికుమార్ మాత్రం జగన్ వేవ్ తట్టుకుని మరోసారి అద్దంకి నియోజకవర్గంలో విజయం సాధించారు. మామూలుగానే అద్దంకి తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం. ఆ పార్టీ ఆవిర్భావించిన దగ్గర నుంచి...అంటే 1983 నుంచి 2004 వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే అయిదుసార్లు టీడీపీ విజయం సాధించగా, ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది.