2019 ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జగన్ అదిరిపోయే వ్యూహాలతో, వైసీపీ కమ్మ నాయకులని పోటీలోకి దించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల్లో టీడీపీ కమ్మ నేతలకు పోటీగా వైసీపీ నుంచి కమ్మ నాయకులని నిలబెట్టి విజయం అందుకున్నారు. అలా తెనాలి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన కమ్మ నాయకుడు ఆలపాటి రాజాపై, వైసీపీ తరుపున అన్నాబత్తుని శివకుమార్‌ని నిలబెట్టారు. ఊహించని విధంగా అన్నాబత్తుని విజయం సాధించారు.